హంటర్ రోడ్డులో బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట

హంటర్ రోడ్డులో బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట
  • బీజేపీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు కాంగ్రెస్ యత్నం
  • అడ్డుకున్న బీజేపీ నాయకులు
  • మాటా మాటా పెరిగి దాడి చేసుకున్న ఇరువర్గాలు
  • చెదరగొట్టిన -పోలీసులు.. సీఐ గన్ మెన్ కు గాయాలు

హనుమ కొండ, వెలుగు: అగ్నిపథ్ స్కీమన్ను రద్దు చేయాలని. విభజన హామీలను నెరవేర్పాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో బీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా కొట్లాటకు దారి తీసింది, రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకునే దాకా. వెళ్లింది. దీంతో హంటర్ రోడ్డు వద్ద పరిస్థి ఈ రణరంగాన్ని తలపించింది. పోలీసులు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సీక గన్మస్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోసీల చేతికి గాయమైంది.
దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సీఐ గన్‌‌‌‌మన్‌‌‌‌ను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. 

మీటింగ్ జరుగుతుండగా వచ్చి..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయడంలో భాగంగా రాజస్తాన్‌‌‌‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్ మాథుర్.. శుక్రవారం వరంగల్ వచ్చారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో హంటర్ రోడ్డులోని జిల్లా ఆఫీస్‌‌‌‌లో సమావేశమయ్యారు. ఓ వైపు మీటింగ్ జరుగుతుండగా.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన మహిళా నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అగ్నిపథ్ స్కీమ్‌‌‌‌ను రద్దు చేయాలని, విభజన హామీల్లో భాగంగా వరంగల్ జిల్లాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ తదితర హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌‌‌‌ చేశారు. ‘మోడీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బయటికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఇన్‌‌‌‌చార్జి మురళీధర్, నేతలు, కార్యకర్తలు.. కాంగ్రెస్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

ఎంపీ ఓం ప్రకాశ్, ఇతర నేతల హౌజ్ అరెస్ట్
తెలంగాణ సంపర్క్ అభియాన్ షెడ్యూల్‌‌‌‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్ మాథుర్ దళిత వాడలైన 53వ డివిజన్ లష్కర్ సింగారంలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. అక్కడే దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ గొడవ తర్వాత బీజేపీ నాయకులు లష్కర్ సింగారం బయల్దేరగా.. అక్కడ టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్లాన్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పార్టీ ఆఫీస్ ఎదుటే బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య మళ్లీ తోపులాట జరిగింది. సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హనుమకొండ ఏసీపీ అశోక్ కుమార్, ఇతర ఆఫీసర్లు ఎంపీ ఓం ప్రకాశ్ మాథుర్ సహా ఇతర నాయకులను బీజేపీ ఆఫీస్‌‌‌‌లోనే ఉంచి హౌజ్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్లను అరెస్ట్ చేయకుండా.. తమను అరెస్ట్​ చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఎంపీ ఓం ప్రకాశ్‌‌‌‌తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఇతర నేతలతో పోలీసులు చర్చలు జరిపారు. లష్కర్ సింగరానికి బదులు పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్న న్యూశాయంపేటకు వెళ్లేలా వారిని ఒప్పించారు. భారీ బందోబస్తు నడుమ బీజేపీ నేతలు న్యూశాయంపేట వెళ్లి అక్కడ దళితులతో సమావేశమయ్యారు.

తలలు పగులగొట్టిన్రు..
పార్టీ మీటింగ్ జరుగుతుండగా అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ బీజేపీ నేతలు చెప్పగా.. అగ్నిపథ్​, విభజన హామీల గురించి కాంగ్రెస్ నేతలు నిలదీశారు. దీంతో రెండు పార్టీ నాయకులకు మాటల యుద్ధం మొదలైంది. పరిస్థితి కొట్టుకునే దాకా పోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండాలు, కర్రలతో దాడికి చేయగా.. బీజేపీ కార్యకర్తలు కూడా కర్రలతో ప్రతిదాడి చేశారు. ఇష్టమొచ్చినట్టు కొట్టుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సుబేదారి సీఐ రాఘవేందర్, కేయూ సీఐ దయాకర్ మధ్యలోకి వెళ్లి కార్యకర్తలను విడదీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సుబేదారి సీఐ రాఘవేందర్ గన్‌‌‌‌మన్‌‌‌‌ అనిల్‌‌‌‌పై కర్రతో దాడి చేశారు. తలకు బలంగా దెబ్బ తాకడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే హనుమకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేయూ సీఐ దయాకర్ చేతికి స్వల్ప గాయమైంది. గన్‌‌‌‌మన్‌‌‌‌పై దాడి చేసిన యువకుడికి గాయాలు కాగా.. అతడిని ఇంకో హాస్పిటల్‌‌‌‌లో జాయిన్ చేశారు. ఘర్షణ సమయంలో అక్కడకు కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారు రాగా.. బీజేపీ కార్యకర్తలు కారు అద్దాలను ధ్వంసం చేశారు.

ఎక్కడా ఇలాంటి నిర్బంధం లేదు: ఎంపీ ఓం ప్రకాశ్ మాథుర్
తెలంగాణ ప్రజలను కలవడానికి బీజేపీ జాతీయ నేతలంతా వచ్చారని, శాంతియుతంగా ప్రజలను కలవడానికి వస్తే నిరసనల పేరిట దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రాజస్యభ సభ్యుడు ఓం ప్రకాశ్ మాథుర్ మండిపడ్డారు. కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నదని, నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను కలిసేందుకు వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నదని, తాను ఎన్నో రాష్ట్రాలు తిరిగానని, కానీ ఎక్కడా ఇలాంటి నిర్బంధం చూడలేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కై బీజేపీ సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రావు పద్మ మండిపడ్డారు. పార్టీ జిల్లా ఇన్‌‌‌‌చార్జ్ మురళీధర్‌‌‌‌‌‌‌‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, నాయకులు కోరబోయిన సాంబయ్య, రావుల కిషన్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.