ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రాహుల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరసనగా కదంతొక్కిన కాంగ్రెస్

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రాహుల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరసనగా  కదంతొక్కిన కాంగ్రెస్

వెలుగు, నెట్​వర్క్​ : రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లెక్కారు. హనుమకొండ, ఖమ్మం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, మోదీ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

హనుమకొండ, కొత్తగూడెంలో కాంగ్రెస్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ, బీజేపీ పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత నెలకొని, పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.