10 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్​ హైకమాండ్ ఆదేశం

10 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్​ హైకమాండ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మునుగోడు బైపోల్​లో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు వెంకట్ రెడ్డి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ అంశంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ రిపోర్ట్ ఇచ్చారని అన్వర్ లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకటరెడ్డి అక్కడి ఎన్ఆర్ఐలతో మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాను ప్రచారానికి వెళ్తే 10వేల ఓట్లు ఎక్కువ వస్తయని, అంతే తప్ప కాంగ్రెస్ గెలవదని ఆయన అన్నారు. ఈ వరుస పరిణామాలతో హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ క్రమశిక్షణ రూల్స్ ను ఉల్లంఘించారని, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ వెంకట్​రెడ్డికి షోకాజ్​ నోటీస్ ఇచ్చింది.