నేటి (జూన్ 25) నుంచి ఎస్టీ నేతల బస్సు యాత్ర

నేటి (జూన్ 25) నుంచి ఎస్టీ నేతల బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు:  దేశంలోని ఎస్టీలకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ రిజ్వర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు, నేతలు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపడుతున్నారు. గాంధీ భవన్‌‌‌‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, అడ్లూరి జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి నుంచి ఎస్టీల సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు నేతలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ బలరామ్ నాయక్, విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తదితరులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బస్సు యాత్ర ఉద్దేశాన్ని వారు సీఎంకు వివరించారు.