క, శ్రీ చిదంబరం లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా గుర్తింపును అందుకున్నారు చింతా గోపాలకృష్ణా రెడ్డి. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం 'రావు బహదూర్'. మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది. జులై 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి ఇలా ముచ్చటించారు.
“ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద చిత్రా లకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నేను, సోలో ప్రొడ్యూసర్ గా తమిళంలో సముద్రఖని గారితో తిరుమాణిక్యం, తెలుగులో క, చిదంబరం చిత్రాలు చేశాను. ఇక 'రావు బహదూర్' కథను మొదట నమ్రత గారు విన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ నాకు కథ చెప్పారు. కథ వైవిధ్యంగా ఉండడంతో బడ్జెట్ ఎక్కువైనా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం.. కొత్తదనం లేకుండా ఇప్పుడు సినిమా చేయడం చాలా కష్టం.
ఏదో ఓ జానర్ హిట్ అయిందని మళ్లీ అవే తీస్తే ప్రేక్షకులు ఆదరించరు. నేను కంటెంట్ను, డైరెక్టర్ను నమ్ముతా. వెంకటేష్ మహా ఎంతో గొప్ప విజన్ తో తీశారు. నిజానికి ఇలాంటి కాన్సె ప్ట్, ఇలాంటి మేకింగ్తో కూడిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశారు. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ పర్ఫెక్ట్ సరిపోయారు. ప్రతిరోజు ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. 90 రోజులు షూట్ జరిగింది.
ఇటీవల మహేష్ బాబు గారు సినిమా చూసి ఆశ్చర్యపోయారు. 24 క్రాఫ్ట్స్ లోనూ అద్భు తంగా వచ్చిందని, ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని చెప్పడం మాలో కాన్ఫిడెన్స్ పెంచింది. రిలీజ్కు ముందే ఓటీటీ, ఓవర్సీస్ బిజినెస్ పూర్తయింది. బిగ్ స్క్రీన్పై చూ సినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. ఫిల్మ్ లవర్సు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది. ఇక వినాయక చవితికి ఓ సినిమా, దసరాకు మరో సినిమా రిలీజ్ చేయబోతున్నాం. షూటింగ్స్ పూర్తయ్యాయి. త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తాం".
