అలియా భట్, శర్వరి వాఘ్ లీడ్ రోల్స్ లో వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా', యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరి యంటెడ్ మూవీ ఇది. 'ది రైల్వే మెన్' ఫేమ్ శివ్ రావైల్ దర్శకుడు. ఆదిత్య చోప్రా నిర్మించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జులై 3న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను గురించి అలియా మాట్లాడుతూ 'నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.
యాక్షన్, గ్రాండి యర్. అడ్వెంచర్లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఫుల్ హ్యాపీ. నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్ పీరియె న్స్ ఇది. షూటింగ్ లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. ఇద్దరు హీరోయిన్స్ చుట్టూ తిరిగే ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. 'ఆల్ఫా' అనేది ఆటిట్యూడ్కి, సెలెబ్రేషన్కి కేరాఫ్గా నిలుస్తుంది. మా డైరెక్టర్, యాక్షన్ టీమ్ తెర వెనుక ఎంతో కష్టపడ్డారు. అదంతా అతి త్వరలో స్క్రీన్పై చూడబోతున్నారు' అని చెప్పింది.
