హైదరాబాద్ సిటీ, వెలుగు: 6 నెలల పసికందు కడుపులోని 500 గ్రాముల కణితిని సిటీలోని ఆస్టర్ ప్రైమ్హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు. నెల క్రితం సర్జరీ చేయగా చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఉందని ప్రకటించారు. పాప కడుపు భాగం ఉబ్బిపోవడం, వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడంతో పరీక్షలు చేశారు.
పాప కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు తేలడం, అది చుట్టుపక్కల అవయవాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని నాలుగు గంటల పాటు క్లిష్టమైన సర్జరీ చేశారు. సురక్షితంగా 500 గ్రాముల కణితిని తొలగించామని, పాప సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ రిషివర్ధన్ రెడ్డి తెలిపారు.
