‘సర్’ పేరిట ఓట్ల తొలగింపు కుట్ర : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 

‘సర్’ పేరిట ఓట్ల తొలగింపు కుట్ర : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 

సైఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం 'సర్' పేరిట ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌లోని ఆదర్శ్‌‌‌‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్​ప్రక్రియ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే తమను సంప్రదించాలని, అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు.

బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఒకవేళ లేకపోతే 2025 నాటి మ్యాపింగ్, రికార్డులను చూపించి అధికారులను డిమాండ్ చేయాలని పేర్కొన్నారు.