విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు..విద్య, క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుతారు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు..విద్య, క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుతారు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విద్య, క్రమశిక్షణ, మంచి నడవడికతో విద్యార్థులను తీర్చిదిద్దితే వారు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పారు. బుధవారం భారత్ సేవాశ్రమ సంఘ్ ఆధ్వర్యంలో లోక్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై స్టూడెంట్స్​కు నోట్‌బుక్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులను డ్రగ్స్, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచి నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. లోక్ భవన్ స్కూల్​కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదని, వెనుకబడిన వర్గాల పిల్లలకు మంచి విద్య అందించాలనే లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

భారత్ సేవాశ్రమ సంఘ్ సేవా కార్యక్రమాలను గవర్నర్ ప్రశంసించారు.  కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, భారత్ సేవాశ్రమ సంఘ్ ప్రతినిధులు స్వామి మున్నేశ్వరానంద, స్వామి వెంకటేశ్వరానందజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.