ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బ్యాంకు నుంచి డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టిన రూ.3 లక్షలు చోరీకి గురయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లి కాలనీకి చెందిన ఇబ్రహీం సోహెల్ బుధవారం మధ్యాహ్నం బ్యాంకు నుంచి రూ.3 లక్షలు విత్‌డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు.
తర్వాత స్థానిక నేతాజీ చౌక్‌లోని మసీదుకు నమాజ్ చేయడానికి వెళ్లాడు. నమాజ్ ముగించుకుని తిరిగి వచ్చి చూడగా స్కూటీ డిక్కీలో నగదు కనిపించలేదు. డిక్కీ పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు
సేకరించారు.
