గుడిమల్కాపూర్ లో కానిస్టేబుల్ పై చీటింగ్ కేసు

గుడిమల్కాపూర్ లో కానిస్టేబుల్ పై  చీటింగ్ కేసు

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ పై చీటింగ్ కేసు నమోదైన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్  ఫైనాన్స్ లో కార్లు ఇప్పిస్తున్నాడు.  అయితే ఫైనాన్స్ క్లియర్ కానీ రెండు కార్లను ఓ వ్యక్తికి ఇప్పించాడు  కానిస్టేబుల్ షరీఫ్ . ఫైనాన్స్ క్లియర్ కాకపోవడం ఎన్ఓసి ఇవ్వకపోవడంతో పలుమార్లు కానిస్టేబుల్ ను  నిలదీశాడు  బాధితుడు. 

కానిస్టేబుల్ షరీఫ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.  కానిస్టేబుల్ షరీఫ్ తో పాటు, స్థానిక  వ్యక్తిపై కేసు నమోదు  చేశారు  గుడిమల్కాపూర్ పోలీసులు.  గతంలో కానిస్టేబుల్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా పనిచేశాడు.

►ALSO READ | weather alert: ఉదయం, మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం రాత్రి వానలు.. మరో వారంపాటు తెలంగాణలో ఇదే పరిస్ధితి