వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలోకి బైక్ దూసుకుపోయి కానిస్టేబుల్ మరణించాడు. సోమవారం ( ఏప్రిల్ 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రహదారికి చెందిన బ్రిడ్జిలోకి ప్రమాదవశాత్తు బైక్ దూసుకుపోవడంతో నర్సింహులు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.
నర్సింహులు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని, బైకును బ్రిడ్జిలో నుంచి బయటికి తీశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సింహులు మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

