V6 News

30న కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్

30న కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్

30న కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్
రేపటి నుంచి హాల్ టికెట్ల డౌన్​లోడ్
పొద్దున కానిస్టేబుల్, మధ్యాహ్నం ఐటీ పరీక్ష

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌(సివిల్‌‌‌‌‌‌‌‌), ఐటీ అండ్‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ పోస్టుల ఫైనల్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌కు తేదీ ఖరారు అయ్యింది. ఈ నెల 30న పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వివి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 30న(ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌(సివిల్‌‌‌‌‌‌‌‌) తత్సమాన పోస్ట్‌‌‌‌‌‌‌‌ల అభ్యర్థులకు 10 ఉమ్మడి జిల్లాల హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో తుది పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీంతో పాటు ఐటీ అండ్ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు గాను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సెంటర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.

అర్హులైన అభ్యుర్థులు ఈ నెల 24 నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్స్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చని సూచించారు. రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న వారికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే సెంటర్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అభ్యర్థులు హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్ల డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు తలెత్తితే 93937 11110/ 93910 05006 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. support@tslprb.inకు ఈ మెయిల్‌‌‌‌‌‌‌‌ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుని దానిపై పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌‌‌‌‌ ఫొటో (ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు సమయంలో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసింది మాత్రమే) అతికించి తీసుకురావాలని సూచించారు.