పంజాగుట్ట, వెలుగు: యూట్యూబర్ అన్వేశ్‌పై కేసు నమోదైంది. ఆయన ఇటీవల హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీ గురించి అన్వేశ్ అసభ్యంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్యాణి కంప్లైంట్ ఆధారంగా అన్వేశ్‌పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారు.
