మంచు వివాదం..ఊహించని కామెంట్స్ చేసిన మోహన్ బాబు, మనోజ్

మంచు వివాదం..ఊహించని కామెంట్స్ చేసిన  మోహన్ బాబు, మనోజ్

ఇటీవల తన అన్న మంచు విష్ణుతో జరిగిన గొడవలపై ప్రశ్నించిన మీడియాపై మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఏప్రిల్ 6న  కుటుంబ సమేతంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఓపెనింగ్ కు  వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రీసెంట్ ఇష్యూస్ పై స్పందించాలని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు స్పందించాలని అడగ్గా.. భుజంపై సెగ్గడ్డ వచ్చింది గోకుతారా?  అదే రీసెంట్ ఇష్యూ అని సెటైర్లు వేశారు. దీంతో మీడియా ప్రతినిధులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు కూడా మంచు మనోజ్,విష్ణు ఇష్యూని మీడియా ప్రశ్నించింది. దీనికి మోహన్ బాబు కూడా సమాధానం చెప్పకుండా మీ ఇంట్లో  నీ భార్యకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పగలవా? అంటూ ఎదురు ప్రశ్నించారు.   ఎప్పుడు ఏది అడగాలో తెలుసుకోవాలన్నారు. మీడియా మిత్రులంటే తనకు చాలా ఇష్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ ఇద్దరు ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారని వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఓ వీడియోను మంచు మనోజ్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో మనోజ్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ పడ్డారు. తర్వాత మోహన్ బాబు క్లాస్ పీకడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు.