టూరిజం ప్రాజెక్టుల పూర్తికి కోర్డినేషన్ కమిటీ!

 టూరిజం ప్రాజెక్టుల పూర్తికి కోర్డినేషన్ కమిటీ!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వివిధ శాఖల మధ్య తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎస్​ కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్​చేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించేలా పని చేయనుంది.

 టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఏ. వాణి ప్రసాద్ సోమవారం సెక్రటేరియెట్​లో  సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టూరిజం శాఖలో కొనసాగుతున్న ప్రాధాన్య కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. 

  • పర్యాటక ప్రాజెక్టులను అందుబాటులోకి  తేవాలి

రాష్ట్రంలో పూర్తయిన పర్యాటక ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా, తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వాణి ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం టూరిజం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఎండీ పి. గౌతమితో కలిసి ఆమె సిటీలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు.