కోర్టులోనే కొట్టుకున్న టెన్నిస్ ఆటగాళ్లు

కోర్టులోనే కొట్టుకున్న టెన్నిస్ ఆటగాళ్లు

ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లు కోర్టులోనే కొట్టుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఓర్లియన్స్‌ ఛాలెంజర్‌ టోర్నీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 

టెన్నిస్ కోర్టులో బాక్సింగ్
ఓర్లియన్స్‌ ఛాలెంజర్‌ టోర్నీ 16వ రౌండ్ లో ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఆటగాడు కోరెంటిన్‌ మౌటెట్‌, బల్గేరియాకు చెందిన ఆడ్రియన్‌ ఆండ్రీవ్‌ తలపడ్డారు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో  మౌటెట్‌ను  2-6, 7-6, (7-3), 7-6 (7-2) తేడాతో  ఆడ్రియన్‌ ఆండ్రీవ్‌ ఓడించాడు.

అయితే  మౌటెట్ 771 ర్యాంకులో ఉండగా..ఆండ్రీప్ 247వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. దీంతో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న మౌటెట్ను కాగా..ఆండ్రీప్ ఓడించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇద్దరు షెక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో గొడవపడ్డారు. ఒకరి చాతితో మరొకరు తోసుకున్నారు. ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడిచేసుకున్నారు. ఛైర్‌ ఎంపైర్లు కలగజేసుకోవడంతో  దుర్భాషలాడుకుంటూ వారు కోర్టు నుంచి వెళ్లిపోయారు.