దేశంలో మళ్లీ విస్తరిస్తున్న కరోనా

దేశంలో మళ్లీ  విస్తరిస్తున్న కరోనా

మూడు రోజుల్లో లక్ష దాటినయ్​
దేశంలో మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా
కొత్తగా మరో 41 వేల కేసులు
111 రోజుల తర్వాత ఇదే హయ్యెస్ట్
మహారాష్ట్రలోనే 25,681 మందికి పాజిటివ్
ఢిల్లీలో 813 మందికి, ఈ ఇయర్ హయ్యెస్ట్
8 రాష్ట్రాలు, యూటీల్లో  కేసులు పెరుగుతున్నాయన్న హెల్త్ మినిస్ట్రీ

న్యూఢిల్లీ, వెలుగు:కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. 10 రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. కేవలం మూడు రోజుల్లోనే లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం 35,871, శుక్రవారం 39,726 కేసులు నమోదు కాగా, శనివారం ఏకంగా 40,953 కొత్త కేసులు రికార్డయ్యాయి. దాదాపు 111 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఒక్క మహారాష్ట్రలోనే 25,681 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా 1,11,07,332 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,88,394 (మొత్తం కేసుల్లో 2.49 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 96.12 శాతంగా ఉందని వెల్లడించింది. శనివారం 188 మంది చనిపోగా, మొత్తం డెత్స్ సంఖ్య 1,59,558కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్రలో 70 మంది చనిపోయారు. ఓవరాల్​గా మహారాష్ట్రలో 53,208 డెత్స్ నమోదయ్యాయి. దేశంలో 70 శాతం డెత్స్ కోమార్బిడిటీస్ వల్లే జరుగుతున్నాయని హెల్త్ మినిస్ట్రీ చెబుతోంది.

ఢిల్లీలో ఈ ఏడాదిలో హయ్యెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా విస్తరిస్తోంది. రెండు వారాలుగా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 813 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో ఈ ఇయర్ లో ఇదే హయ్యెస్ట్. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్​ను స్పీడప్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు సుమారు 40 వేల మందికి వ్యాక్సిన్ వేస్తుండగా.. ఈ సంఖ్యను  1.25 లక్షలకు పెంచనుంది.

8 రాష్ట్రాలు, యూటీల్లో పెరుగుదల

దేశంలో 8 రాష్ట్రాలు, యూటీల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్​లోనే 76.22% కేసులు రికార్డవుతున్నాయని తెలిపింది. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటకలో కేసులు పెరుగుతున్నాయని, కేరళలో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొంది. కొత్త డెత్స్​లో 81.38% ఐదు రాష్ట్రాల్లోనే రికార్డవుతున్నాయని చెప్పింది. కాగా, 24 గంటల్లో 15 రాష్ట్రాలు, యూటీల్లో ఒక్క డెత్ కూడా నమోదు కాలేదు.

4.2 కోట్ల డోసుల పంపిణీ
శనివారం ఉదయం దాకా 4,20,63,392 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. శుక్రవారం ఒక్కరోజే 27,23,575 టీకాలు వేసినట్లు తెలిపింది. కేరళ, కర్నాటక, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లోనే 60 శాతం వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 31 వరకు ఆంక్షలు ..వెల్లడించిన మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ రౌత్‌‌‌‌‌‌‌‌


నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆంక్షలను మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ రౌత్‌‌‌‌‌‌‌‌ శనివారం వెల్లడించారు. అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా నాగ్‌‌‌‌‌‌‌‌పూర్ జిల్లాలో మార్చి 15 నుంచి 21 వరకు సర్కారు ఆంక్షలు విధించింది. జిల్లాలో కేసుల పరిస్ధితిపై అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. కొద్దిపాటి మినహాయింపులతో ఈనెల 31వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28, 29 తేదీల్లో కొన్ని మార్పులు ఉంటాయన్నారు. నిత్యావసర వస్తువుల షాపులు సాయంత్రం 4 వరకు, రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి 7 వరకు తెరిచి ఉంటాయని వెల్లడించారు. ఫుడ్‌‌‌‌‌‌‌‌ డెలివరీకి రాత్రి 11 వరకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించనివారిపై పోలీసు లు చర్యలు తీసుకుంటుందన్నారు. నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం 3,235 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1,85,787కు పెరిగింది.