క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

రష్యాలో ఆస్పత్రుల ముందు డజన్ల కొద్దీ అంబులెన్సుల లైన్
లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడంతో అంత్యక్రియలకు సిద్ధమవుతున్న చైనా జనం
బ్రిటన్‌‌లో 10 వేలకు దగ్గర్లో మరణాలు

నిన్నమొన్నటి వరకు మంచిగనే ఉన్న రష్యాలో రెండు, మూడు రోజులుగా పరిస్థితి తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఆ దేశ ముఖ్య నగరాలు మాస్కో,
సెయింట్‌‌ పీటర్స్‌‌బర్గ్‌‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అక్కడి ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి. రోగులతో అంబులెన్సులు రోడ్డుపై
క్యూ కడుతున్నాయి. శనివారం మాస్కోలోని షెరెమెట్యేవో ఎయిర్‌‌పోర్టుకు దగ్గర్లోని ఓ హాస్పిటల్‌‌ దగ్గర 45కు మించి అంబులెన్సులు పేషెంట్లను
చేర్పించేందుకు లైన్‌‌లో వేచి ఉన్నాయి. ఆ హాస్పిటల్‌‌కు దగ్గర్లో ఉండే స్థానికుడొకరు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్టు చేశారు. హాస్పి టల్‌‌లో చేరడానికి ఒక్కో పేషెంట్‌‌కు సుమారు 15 గంటల టైమ్‌ పడుతోందని అక్కడి అంబులెన్స్‌‌ డ్రైవర్లు చెబుతున్నారు. లోసినూస్ట్రోవ్‌‌స్కోయ్‌‌ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రష్యా వ్యాప్తంగా రెండు, మూడు రోజులుగా రోగుల సంఖ్య ఎక్కువవుతోంది. ఆ దేశ
అధికారులు కూడా దేశంలో కేసులు ఎక్కువై పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. హాస్పిటళ్లు పేషెంట్లను హ్యాండిల్‌‌ చేయలేకపోతున్నాయన్నారు. మాస్కోలోని హాస్పిటళ్లనీ ఎమర్జెన్సీ మోడ్‌‌లో ఉన్నాయని చెప్పారు.

చైనాలో అంత్యక్రియలకు సిద్ధమైతున్న జనం
చైనాలోని వుహాన్‌‌లో లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడంతో కరోనాతో చనిపోయిన వాళ్లను పూడ్చేందుకు జనం క్యూ కడుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా
సిటీలో లాక్‌‌డౌన్‌‌ పెట్టిన అధికారులు వ్యాధితో చనిపోయిన వాళ్ల అంత్యక్రియలను కూడా నిలిపేశారు. 76 రోజుల తర్వాత లాక్‌‌డౌన్‌‌ ఎత్తేయడంతో
చనిపోయిన తమ వాళ్లకు తుది వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చైనాలో కరోనా కేసులు శనివారం మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 162 కేసులు నమోదయ్యాయని, ఇందులో వంద వరకు బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్లేనని అధికారులు చెప్పారు.

వుహాన్‌‌ ల్యాబ్‌ కు అమెరికా నిధులు
కరోనా పుట్టిన వుహాన్‌‌లోని వైరాలజీ ల్యాబ్‌ కు అమెరికాలోని నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హెల్త్‌‌ ఇప్పటివరకు రూ. 30 కోట్ల నిధులిచ్చింది. గత పదేళ్లుగా ఈ ఇన్‌‌స్టిట్యూట్‌‌కు అమెరికా నిధులిస్తూ వస్తోంది. ఈ ల్యాబ్‌ లోనే వైరస్‌‌ పుట్టిందని విమర్శలొచ్చాయి. కరోనా వ్యాపించిందని అనుమానిస్తున్న గబ్బిలాలపైనే ఈ ఇన్‌‌స్టిట్యూట్‌‌ పరిశోధనలు చేస్తోంది.

బ్రిటన్ లో పదివేలకు చేరువలో
బ్రిటన్‌‌లో కరోనా మరణాలు పది వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 78 వేల మందికి పైగా వైరస్‌‌ సోకగా, 300 మందే రికవరయ్యారు.

ఇంకిన్ని దేశాల్లో ఇట్లిట్ల
ఈజిప్టులో కరోనాతో మరణించిన డాక్టర్‌‌ అంత్యక్రియలకు అంగీకరించని గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ క్వారంటైన్‌‌ హాస్పి టల్‌‌లో పని చేస్తూ ఆ డాక్టర్‌‌ చనిపోయారు.
కరోనాతో అతలాకుతలమవుతున్న ఇటలీలో లాక్‌‌డౌన్‌‌ను సడలించడానికి అక్కడి అధికారులు ఆలోచిస్తున్నారు.
జర్మనీలోని ఫ్రాంక్‌‌ఫుర్ట్‌‌లో పార్టీ చేసుకుంటున్న ఓ 20 మందిని పోలీసులు అడ్డుకోగా వాళ్లు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
సింగపూర్‌‌లో పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్టు వాడే వాళ్లు తప్పనిసరిగా మాస్క్‌‌ పెట్టుకోవాలని ఆ దేశం ఆదేశించింది. లేదంటే 200 డాలర్ల ఫైన్‌‌ వేస్తామంది.
చైనాలో ఆఫ్రికన్‌‌ దేశీయులపై దాడులు జరుగుతున్నాయి. గాంగ్‌‌జావ్‌‌లో ఐదుగురు నైజీరియన్లకు ఇటీవల వైరస్‌‌ పాజిటివ్‌‌ వచ్చిన తర్వాత తమపై దాడులు, వివక్ష ఎక్కువయ్యాయని అక్కడి ఆఫ్రిక్లను చెప్పారు.
జపాన్‌‌లో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావొద్దని ఆ దేశ ప్రధాని
షింజో అబే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను ఇంట్లో తన డాగ్‌‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్‌‌లో పోస్ట్‌‌ చేశారు.
వైరస్‌‌ ఎక్కువగా వ్యాపిస్తున్న జెరూసలేం లోని చాలా భాగాన్ని ఇజ్రాయెల్‌‌ సీల్‌‌ చేసింది.
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ చెప్పారు.

For More News..

భారత్ లో 9వేలు దాటిన కేసులు