మార్చిలో కారుగేటెడ్ ప్యాకేజింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో

మార్చిలో కారుగేటెడ్ ప్యాకేజింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో

న్యూఢిల్లీ :  కారుగేటెడ్ (మడత పెట్టిన)  ప్యాకేజింగ్ మెషినరీ పరిశ్రమ కోసం ‘కార్రు ప్యాక్ ప్రింట్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో 2024’ ను   ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్చి 7 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. 

ఇండియన్ పేపర్ కారుగేటేడ్, ప్యాకేజింగ్ మెషినరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐసీపీఎంఏ)  ఫ్యూచరెక్స్  గ్రూప్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో లో కారుగేటెడ్ ప్యాకేజింగ్ మెషినరీ రంగంలోని ప్రముఖ తయారీదారులు పాల్గొంటారు. 

 తమ తాజా ఉత్పత్తులను,  అత్యాధునిక యంత్రాలను ప్రదర్శిస్తారు.   2020 ఆర్థిక సంవత్సరంలో సుమారు  75 బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారతీయ ప్యాకేజింగ్ పరిశ్రమ  ఏటా18-–20శాతం సీఏజీఆర్​ను సాధిస్తోంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు  200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.