వరంగల్సిటీ, వెలుగు: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బుధవారం ప్రకటించింది. మొదటి విడత తరవాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 29వ తేదీ(గురువారం) సాయంత్రం 6 గంటల లోపు అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా, సీట్ల ఖాళీల వివరాలను ఆఫీసర్లు వెబ్‌సైట్ లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

