హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కారం కింద ఇరిగేషన్ ఈఎన్సీ, పలువురు ఇంజినీరింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్లంపల్లిలోని శ్రీపాదసాగర్ మొదటి దశ పనులకు చెందిన రూ.76.53 కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు చెందిన రూ.28.97 కోట్లు చెల్లించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించింది. ఈఎన్సీ మురళీధర్‌తో పాటు ఆయా ప్రాజెక్టులకు చెందిన ఇంజినీరింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
