ఆయుర్దాయానికి కోవిడ్‌ కోత...పదేళ్ల పురోగతి రెండేళ్లలో ఢమాల్​

ఆయుర్దాయానికి కోవిడ్‌ కోత...పదేళ్ల పురోగతి రెండేళ్లలో ఢమాల్​

కోవిడ్-19 ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం క్షీణించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. 2019 నుండి 2021 వరకు సగటు ఆయుర్దాయం దాదాపు 1.8 సంవత్సరాలు క్షీణించి 73.2 సంవత్సరాల నుంచి 71.4 సంవత్సరాలకు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వలన ఒక దశాబ్దపు పురోగతి తుడిచిపెట్టుకు పోయి, ఆయుర్దాయం ఇంతకుముందు ఉన్నటువంటి 2012 స్థాయికి చేరుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి పుట్టుక ప్రజల ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని   (HALE) తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే, 2021లో సగటు వ్యక్తి మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆశించే సమయం 1.5 సంవత్సరాల నుండి 61.9 సంవత్సరాలకు పడిపోయింది. ఇది కూడా 2012 స్థాయికి చేరుకుందని WHO అధ్యయనం తెలిపింది.

అమెరికా ,  ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలు అత్యంత తీవ్రమైన ప్రభావాలను చవిచూశాయి. కరోనా మహమ్మారి ఎక్కువుగా ఉన్న దేశాల్లో ఆయుర్దాయం  మూడు సంవత్సరాలు  ఆయుర్దాయం క్షీణించిందనిWHO తెలిపింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం తక్కువ ప్రభావాలను చూసింది, ఆయుర్దాయం మరియు HALE వరుసగా 0.1 మరియు 0.2 సంవత్సరాల కంటే తక్కువ తగ్గింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్  తెలిపారు. 

  ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి, ప్రపంచ ఆయుర్దాయం పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామనిWHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.  అయితే   అవి సానుకూలంగా కనిపిస్తున్న తరుణంలో కేవలం రెండేళ్ళలో, కోవిడ్-19 మహమ్మారి ఆయుష్షులో ఒక దశాబ్దపు లాభాలను తొలగించిందని అన్నారు. WHO నివేదికలో వికలాంగులు, శరణార్థులు, వలసదారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లను మరింత హైలైట్ చేశారు. 2021లో, దాదాపు 1.3 బిలియన్ల మంది లేదా ప్రపంచ జనాభాలో 16% మంది వైకల్యాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య అడ్డంకులను తొలగించడానికి తోడ్పాటు అందించాలని WHO సూచించింది.

గత అర్ధ శతాబ్దంలో మనుషులు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల కంటే కోవిడ్-19 ఆయుర్దాయంపై "ఎక్కువ లోతైన ప్రభావం" చూపిందని పరిశోధకులు తెలిపారు. జనవరిలో లాన్సెట్ ప్రచురించిన ఒక అధ్యయనంలో మహమ్మారి సమయంలో సగటు ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు పడిపోయిందని పేర్కొనగా, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో దాని కంటే మరింత ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, అమెరికా, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో 2019, 2021 మధ్య ఆయుర్దాయం సుమారు 3 సంవత్సరాలు, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 2.5 సంవత్సరాల వరకు గణనీయంగా క్షీణించిందని తెలిపింది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం మాత్రం కనిష్ట ప్రభావాలను చూసింది, అక్కడ ఆరోగ్యకరమైన ఆయుర్దాయం0.1 సంవత్సరాల నుంచి 0.2 సంవత్సరాల కంటే తగ్గింది.

మొత్తంగా 2018 నుండి, అదనంగా 1.5 బిలియన్ల మంది ప్రజలు మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు ను అభివృద్ధి చేసుకున్నారు. అయితే, పెరుగుతున్న ఊబకాయం రేట్లు, అధిక పొగాకు వినియోగం, నిరంతర వాయు కాలుష్యం వంటి సవాళ్లతో పురోగతికి ఆటంకం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.