కరోనా కొత్త లక్షణం కొవిడ్​ టోస్​..పాదాలు కందిపోతున్నయ్

కరోనా కొత్త లక్షణం కొవిడ్​ టోస్​..పాదాలు కందిపోతున్నయ్

జ్వరం, దగ్గు , తలనొప్పి.. ఇప్పటిదాకా కరోనా పేషెంట్లలో బయటపడుతున్న లక్షణాలివి. వాటికి ఈమధ్యే వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలూ తోడయ్యాయి. ఇప్పుడు మరో కొత్తలక్షణాన్ని సైంటిస్టులు గుర్తించారు. అదే చేతులు, పాదాల్లో రక్తనాళాలు వాచిపోవడం. దాని వల్ల నొప్పి,బెందులు వచ్చి పాదాలు కందిపోతున్నాయి. తీవ్రతను బట్టి ఎరుపు, నీలం రంగులోకి పాదాలుమారుతున్నాయి. పిల్లల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. దీన్నే ‘కొవిడ్ టోస్ ’ అని సైంటిస్టులు పిలుస్తున్నా రు. కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు బయటపడుతున్నాయని అమెరికాలోని నార్త్​వెస్టర్న్​ యూనివర్సిటీ ఫీన్ బర్గ్​ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డెర్మటాలజీ హెడ్ ఎమీపాలర్ తెలిపారు. నిజానికి చల్లగా ఉన్న టైమ్ లోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని, కానీ, ఇప్పుడు ఎండాకాలంలోనూ ఆ కేసులు ఎక్కువైపోతున్నాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ లోని డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ , అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ మెంబర్ జెన్నిఫర్ హువాంగ్ చెప్పా రు.

ఏంటా కండిషన్​?

కొవిడ్​ టోస్​ను టెక్నికల్​గా పెర్నియో అని పిలుస్తారు. దద్దుర్లు తేలి నొప్పి వస్తుంది. చర్మం రాలిపోతుంది. పుండ్లు పడతాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకూ వచ్చినా, ఆటో ఇమ్యూన్​ జబ్బులున్నోళ్లకు మరీ ఎక్కువగా ఉంటుందని హువాంగ్​ అంటున్నారు. ఎక్కువగా తినడం, హెపటైటిస్​, హెచ్​ఐవీ వంటివి ఉన్నవాళ్లలోనూ ఆ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

వేడే విరుగుడు

ఏ ట్రీట్​మెంట్​ లేకుండానే రెండు వారాల్లో అది పోతుంది. అయితే, పరిస్థితి సీరియస్​ కాకుండా ఉండేందుకు, అవి పోయేందుకు కొంచెం వేడి వాతావరణంలో ఉంటే మేలని డాక్టర్లు చెబుతున్నారు. చేతులు, పాదాలను వెచ్చగా ఉంచుకోవాలంటున్నారు. రక్తనాళాల వాపును తగ్గించేందుకు, బీపీని కంట్రోల్​లో ఉంచేందుకు మందులు తీసుకోవాలని పాలర్​ చెప్పారు.

చలి కారణమే

చలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తుంటాయని పాలర్​ అంటున్నారు. ఇప్పుడు కరోనా పాజిటివ్​ పిల్లల్లో ఈ ‘మినీ ఎపిడెమిక్​’ రావడానికి ఆ చలి వాతావరణమూ తోడైందని చెబుతున్నారు. చలి నుంచి కాపాడుకునే బట్టలు వేసుకోకపోతే రక్తనాళాలు వాచిపోతాయని, వేళ్లు, పాదాలు ఎర్రగా కందిపోతాయని అంటున్నారు. 2 వారాలు ఎఫెక్ట్​ ఉంటుందని హువాంగ్​ చెప్పారు.

ఇదీ ఎసింప్టమాటికే..

కరోనా టైంలో ఈ కండిషన్​ తొలిసారిగా ఇటలీలో బయటపడినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. పిల్లలతో పాటు చాలా మంది పేషెంట్లలో ఈ ‘కొవిడ్​ టోస్​’ లక్షణాలు కనిపించాయంటున్నారు. చలికాలంలో వచ్చే దీని సింప్టమ్స్​ మామూలుగానే ఉంటాయని, కరోనా వల్ల సీరియస్​ అవుతున్నాయని పాలర్​ అన్నారు. లక్షణాలు లేని కరోనా పేషెంట్లలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని హువాంగ్​ చెప్పారు.