ఆవుల అక్రమ రవాణా.. రెండు డీసీఎంలు సీజ్

ఆవుల అక్రమ రవాణా.. రెండు డీసీఎంలు సీజ్

కీసర, వెలుగు: అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలను కీసరలో వీహెచ్​పీ నేతలు గురువారం పట్టుకున్నారు. వాహనాలను ఆపాలని సూచించినా వినకుండా వెళ్లడంతో డీసీఎం అద్దాలను పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలతోపాటు ఇద్దరు డ్రైవర్లను పోలీస్ స్టేషన్​కు తరలించారు. పట్టుబడ్డ ఆవులను హైజా లేదా జియగూడ గోశాలకు తరలిస్తామన్నారు.