ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ సమస్యలపై కంట్రోల్​ రూమ్ ఏర్పాటు..

ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ సమస్యలపై కంట్రోల్​ రూమ్ ఏర్పాటు..

గచ్చిబౌలి, వెలుగు  : భారీ వర్షాల కారణంగా ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ సమస్యల​పై  కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. ఆఫీస్​లకు వెళ్లే ఎంప్లాయీస్​ సొంత కార్లలో కాకుండా కారు పూలింగ్(షేరింగ్)​లో వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ వంటి పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​లో ప్రయాణించాలని పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్​లో ఐటీ కంపెనీల ప్రతినిధులు, హోటల్స్​, హాస్పిటల్స్, ఫార్మా కంపెనీల సీఈవోలు, పోలీసు అధికారులతో సీపీ మీటింగ్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ..  సైబరాబాద్​ కమిషనరేట్​పరిధిలోని ఐటీ కారిడార్​లో వర్షపునీరు నిలిచే రోడ్లను గుర్తించి 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించేందుకు 10 ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయన్నారు. ఐటీ ఎంప్లాయీస్​ వర్క్​ ఫ్రం హోం పని చేసే విధంగా కంపెనీలు చూడాలన్నారు. 

ట్రాఫిక్​ సమస్య ఉంటే కాల్​ చేయాలె..

ఐటీ కారిడార్​లో వానలతో తలెత్తే ట్రాఫిక్​ సమస్యలు, వాటర్​ లాగింగ్​ పాయింట్లపై కాల్ ​చేసేందుకు మేడ్చల్ ట్రాఫిక్​ డీసీపీ ​ నం.8712663011, మాదాపూర్​ ట్రాఫిక్ ​డీసీపీ నం.8712663010, సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ వాట్సాప్​ 9490617346, ఏవైనా వెహికల్స్​ రోడ్డుపై బ్రేక్​డౌన్​ అయితే 8333993360 నంబర్​కు వాట్సాప్​ మెసేజ్​ చేయాలని సీపీ  తెలిపారు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.