
కరీంనగర్ : ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో సీపీఐ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద సీపీఐ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఆర్మీ అభ్యర్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల యువత కేసుల పాలవడం బాధాకరమన్నారు.