రెయిడ్ కోసం వచ్చిన.. ఈడీ అధికారుల కార్లపై రాళ్ల దాడి..

రెయిడ్ కోసం వచ్చిన.. ఈడీ అధికారుల కార్లపై రాళ్ల దాడి..

కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. CMRL మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీసీఎం పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ అధికారులు చేశారు. విజయన్ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై సీపీఎం కార్యకర్తలు దాడి చేయడంతో తిరువనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం విజయన్, ఆయన కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న ఇళ్లు, ఆఫీసులతో సహా 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు దాడులు చేశాయి. తమ అభిమాన నాయకుడు , మాజీ సీఎం ఇంటిపై దాడుల విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయన్ ఇంటికి చేరుకుని నిరసనలు తెలిపారు.  ఈడీ దాడులను నిరసిస్తూ అధికారుల వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సీఎంఆర్ఎల్-ఎక్సాలాజిక్ మనీలాండరింగ్ (CMRL)కేసులో తిరువనంతపురంలోని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంతో సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం (మే27)తెల్లవారుజామున ఏకకాలంలో పదిచోట్ల దాడులు చేశారు. దీంతో విజయన్ మద్దతుదారులు, సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈడీ దాడులపై ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు గుంపులుగా విజయన్ ఇంటి దగ్గరకు రావడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఒక మహిళా అధికారితో సహా పలువురు కేంద్ర ఏజెన్సీ అధికారులు గాయపడ్డారు. దాడిపై ఈడీ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.