
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్- ప్రొడక్షన్ జరుగుతోంది. వాస్తవానికి ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే డేట్‌కు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ వస్తుండటం, అలాగే సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్, మ్యూజిక్ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై బాలకృష్ణ అప్‌డేట్ అందించారు.
రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘అఖండ 2’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా సంగీతం కోసం తమన్ మరికొంత సమయం కోరినట్టు చెప్పారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే కచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.