నయన్.. టెస్ట్‌‌ మ్యాచ్

నయన్.. టెస్ట్‌‌ మ్యాచ్

హిందీలో షారుఖ్ ఖాన్‌‌కి జంటగా ‘జవాన్‌‌’ చిత్రంలో నటిస్తున్న నయనతార.. మరో రెండు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇవికాక ఆమె మరో కొత్త సినిమాకు సైన్ చేసింది. ‘టెస్ట్‌‌’ అనే టైటిల్‌‌తో రూపొందుతున్న ఈ సినిమాను అఫీషియల్‌‌గా అనౌన్స్‌‌ చేస్తూ మోషన్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో నయన్‌‌తో పాటు మాధవన్, సిద్ధార్థ్ కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు.

నిర్మాతగా లవ్‌‌ ఫెయిల్యూర్, కావ్యతలైవన్, ఇరుది సుట్ర (గురు ఒరిజినల్) లాంటి చిత్రాలను నిర్మించిన శశికాంత్.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. టైటిల్‌‌కు తగ్గట్టే క్రికెట్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కే చిత్రమిది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘రంగ్‌‌ దే బసంతి’లో కలిసి నటించిన మాధవన్‌‌, సిద్దార్థ్ పదిహేడేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇక నయనతార ప్లేస్‌‌లో రాశీఖన్నాను తీసుకున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే నయనతారే నటిస్తుందని మోషన్‌‌ పోస్టర్‌‌‌‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.