కేబీసీలో వైరల్‌గా రూ. 25 లక్షల ప్రశ్న.. ఈ ఆన్సర్ మీకు తెలుసా?

కేబీసీలో వైరల్‌గా రూ. 25 లక్షల ప్రశ్న.. ఈ ఆన్సర్ మీకు తెలుసా?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తోన్న  కౌన్ బనేగా కరోడ్‌పతి షో చాలా పాపులర్ అని తెలిసిందే.  ఈ షోలో అమితాబ్ అడిగే ప్రశ్నలు చాలా ఇంట్రెస్టి్ంగ్ ఉంటాయి.  తాజాగా ముగిసిన ఎపిసోడ్ లో బిగ్ బీ అడిగిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అదేంటంటే .. 

టెస్ట్ క్రికెట్‌లో తండ్రి, కొడుకులిద్దరినీ అవుట్ చేసిన మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు? దీనికి గానూ బిగ్ బీ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.  ఎ, రవిచంద్రన్ అశ్విన్ , బి. రవీంద్ర జడేజా, సి ఇషాంత్ శర్మ. డి. మొహమ్మద్ షమీ. రూ. 25 లక్షల ప్రశ్న కింద బిగ్ బీ ఈ ప్రశ్న వేశారు.  ఇటీవల వెస్టిండీస్‌తో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడిన సందర్భంగా ఈ ప్రశ్నను అడిగారు.  దీనికి కంటెస్టె్ంట్ అశ్విన్ అంటూ సరైన సమాధానం ఇచ్చాడు.  

కాగా  రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ముగిసిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో చంద్రపాల్ వికెట్ తీశాడు. అంతకుముందు 2011 ఢిల్లీలో తన టెస్ట్ అరంగేట్రంలో తండ్రి శివనారాయణ్ చంద్రపాల్‌ను ఔట్ చేశాడు.  అశ్విన్‌తో పాటు, దక్షిణాఫ్రికాకు చెందిన సైమన్ హార్మర్ , ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ (భారతీయులు కానివారు) పైన ఈ తండ్రీకొడుకుల జోడీని ఔట్ చేశారు.