పుష్ప డైలాగ్తో ఆకట్టుకుంటున్న జడేజా

పుష్ప డైలాగ్తో ఆకట్టుకుంటున్న జడేజా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీమిండియా స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియా ఓపెనర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ సరసన చేరాడు.  అయితే, అది క్రికెట్‌‌కు సంబంధించిన అచీవ్‌‌మెంట్‌‌కాదు. ఇన్నాళ్లూ వార్నర్‌‌ మాత్రమే టాలీవుడ్‌‌ సినిమాల్లోని డైలాగ్‌‌లకు లిప్‌‌ సింక్‌‌ చేస్తూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో రీల్స్‌‌ పెట్టేవాడు. ఇప్పుడు జడ్డూ కూడా అదే బాట పట్టాడు. అల్లు అర్జున్‌‌ యాక్ట్‌‌ చేసిన పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అనే పవర్‌‌ ఫుల్‌‌ పంచ్‌‌ డైలాగ్‌‌కు లిప్‌‌ సింక్‌‌ చేసి రీల్‌‌ పోస్ట్‌‌ చేశాడు. ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యింది.