కోబ్రా ద‌ళంలో మ‌హిళా క‌మాండోలు

కోబ్రా ద‌ళంలో మ‌హిళా క‌మాండోలు

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనేందుకు 34 మంది మహిళా CRPF టీం శిక్షణ పూర్తి చేసుకుంది. కోబ్రా కమాండో దళంగా ఆ సిబ్బంది శిక్షణ తీసుకుంది. కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్‌(CoBRA ) దళాన్ని 2009లో CRPF ప్రారంభించింది. అడవుల్లో చాకచక్యమైన యుద్ధ ఆపరేషన్లు చేపట్టేందుకు ఈ దళాన్ని రూపొందించారు. అయితే ఇప్పటి వరకు కేవలం పురుషులు మాత్రమే ఈ కమాండో దళంలో ఉన్నారు. ఇక నుంచి పురుషులతో పాటు …మహిళా కోబ్రా దళం కూడా జంగిల్ ఆపరేషన్స్‌లో పాల్గొననుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీరిని మోహరించనున్నారు. ఇవాళ(శనివారం) కర్దాపూర్ గ్రామంలో జరిగిన వేడుకలో..శిక్షణ పొందిన 34 మంది సిబ్బందిని కోబ్రా దళంలోకి చేర్చుకున్నారు.