ఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది

ఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది

లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అవుతున్నాకొద్దీ ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకో విధంగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. సైబర్ మోసగాళ్ల ప్రలోభాలకు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కేటుగాళ్ల మాయలోపడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం ఆందోళనకర విషయం. ఇటీవల ముంబైకి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 54 లక్షలు పోగొట్టుకుంది.. వివరాల్లోకి వెళితే.. 

నవీముంబైలోని ఐరోలికి చెందిన 37 ఏళ్ల ఓ మహిళ ప్రసూతి సెలవుల్లో ఇంటివద్దనే ఉంటోంది. అదనపు డబ్బు సంపాదించేందుకు ఆన్ లైన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆన్ లైన్ లో కొంతమంది వ్యక్తులను కాంటాక్టు చేసింది. ఫ్రీలాన్సింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని నమ్మబలికారు. వారు ఇచ్చిన పనులను పూర్తి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.ఆ మహిళను ఆఫర్ తో ఒప్పించారు. 

పని మొదలు పెట్టిన ఆ మహిళకు స్కామర్లు పలు సూచనలు చేశారు. హోటళ్లను రేట్ చేయడానికి లింక్ లను అందించారు. చివరగా ఆమె పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి కొంత పేమెంట్ చేసేందుకు ఆమెను ఒప్పించారు. మే 7 నుంచి మే 10 తేదీల మధ్యలో దశల వారీగా ఆమె స్కామర్లు అకౌంట్లకు రూ. 54 ,30,000  చెల్లించింది. ఇంకేముంది అప్పటినుంచి ఆమె కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. దీంతో లబోదిబో మన్న ఆ మహిళ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. మహిళను ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తుతెలయని స్కామర్లపై కేసు నమోదు చేశారు. 

ఆన్  లన్ స్కామ్ లో మోసగాళ్లు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ లతో ప్రజలను ఆకర్షిస్తూ  మోసం చేస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇదే తరహాలో ఎంతో మంది ఆన్ లైన్ స్కామర్లు మోసాల బారిన పడి ఖాతాలు ఖాళీ చేసుకున్నారు. ప్రజలు ఆన్ లైన్  స్కామర్లనుంచి అప్రమత్తం గా ఉంటాలని పోలీసులు సూచిస్తున్నారు.