CRPF : 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRPF :  9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 9 వేలకు పైగా కానిస్టేబుళ్ల (టెక్నికల్ మరియు ట్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అసక్తి కలిగిన వారు  www.crpf.gov.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మార్చి 27 నుంచి మొదలై, ఏప్రిల్ 24న ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ పరీక్ష జూలై 1 నుంచి జూలై 30, 2023 వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 9,212 ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.పురుషుల కోసం మొత్తం ఖాళీల సంఖ్య 9,105, మహిళలకు 107 పోస్టులున్నాయి. ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ 3 ప్రకారం.. రూ.21,700 - 69,100 పొందుతారు. వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు, వయోపరిమితి మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి

పురుషుల పోస్టులు: మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులు ఉన్నాయి.

మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.


ఇక ఫీజుల విషయానికి వస్తే..  జనరల్, EWS మరియు OBC కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు రూ.100గా,  SC/ST అభ్యర్థులు, మహిళలు (అన్ని కేటగిరీలు) అభ్యర్థులు మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది. రిక్రూట్‌మెంట్ గురించి మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.