ఇరాన్ లో కరోనాకు బలవుతున్న డాక్టర్లు, నర్సులు

ఇరాన్ లో కరోనాకు బలవుతున్న డాక్టర్లు, నర్సులు

ఇరాన్​కు ఇప్పుడు కొత్త సంవత్సరం. పర్షియన్​ న్యూ ఇయర్​ నౌరుజ్​ను సెలబ్రేట్​ చేసుకోవాల్సిన టైం. కానీ, ఆ ఇప్పుడు అక్కడోళ్లకు మిగిలింది ఏడుపొక్కటే! అవును, ఇటలీ తర్వాత కేసులు, మరణాల్లో ఇరానే టాప్​లో ఉంది. చావులు ఎక్కువవుతున్నాయి. పేషెంట్లకు ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్లూ కరోనాకు బలవుతున్నారు. కారణం, వాళ్లకు సరైన వసతుల్లేకపోవడమే. జిలాన్​ ప్రావిన్స్​లోని ఓ ఆస్పత్రి ప్రావిన్స్​లో పనిచేస్తున్న మహ్మద్​ అనే డాక్టర్​ దేశంలో ఉన్న పరిస్థితిని వివరించారు. 2 వారాలుగా ఆయన తన ఇంటికి కూడా పోలేదు. పెళ్లాం, పిల్లలను చూడలేదు. ఈ 14 రోజుల్లో ఆయన కళ్లముందే పదుల సంఖ్యలో పేషెంట్లు, వాళ్లకు ట్రీట్​మెంట్​ చేస్తున్న తోటి డాక్టర్ల చావులను చూశారు. అందులో తనకు పాఠాలు చెప్పిన తన మెంటర్​, డాక్టర్​ కూడా ఉన్నారు. దానికి కారణం, అక్కడి ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడమేనని మహ్మద్​ చెబుతున్నారు. తమ ఒత్తిడి చూసి కుటుంబసభ్యులూ ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు. నిజానికి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తారు. కానీ, ఆయన చేసి కేసులు, చావుల విషయంలో ఇరాన్​ తప్పుడు లెక్కలు చూపిస్తోందని చెప్పారు. డాక్టర్లమైన తమకే మాస్కులు, గ్లోవ్స్​, ప్రొటెక్టివ్​ గేర్​ సరిగ్గా లేకపోతే జనాలకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయని ఆవేదన చెందారు.

బెడ్లూ సరిపోవట్లేదు

ఇరాన్​లోని 31 ప్రావిన్స్​లలో వైరస్​ సోకింది. తమ దేశాలకు వైరస్​ రావడానికి కారణం ఇరానేనని ఇరాక్​, కువైట్​, ఒమన్​, లెబనాన్​, యూఏఈ, కెనడా, జార్జియా, న్యూజిలాండ్​లు ఆరోపిస్తున్నాయి. వైరస్​ ప్రారంభమైన తొలి నాళ్లలో పెద్ద ప్రమాదమేమీ లేదని ఇరాన్​ ప్రీమియర్​ అయతొల్లా అలీ ఖమీనీ ప్రకటించారు. ఇరాన్​ శత్రువులే లేనిపోనివి సృష్టించి భయపెడుతున్నారన్నారు. దీంతో జనం బిందాస్​గా ఉన్నారు. హాయిగా కాలం గడిపేశారు. కానీ, కాలం ఊరుకోదు కదా.. ఆ ఎఫెక్ట్​ను రెండు వారాల్లోనే చూపించింది. అసలు కరోనా టెస్టులు చేసేందుకే తమ దగ్గర కిట్స్​ లేవని వైరస్​ తాకిడి బాగా ఉన్న జిలాన్​, గొలెస్తాన్​, మజందార్న్​ ప్రావిన్స్​ల అధికారులంటున్నారు. బేసిక్​ మెడిసిన్​, ఆక్సిజన్​ సిలిండర్లు, మాస్కులు, గ్లోవ్స్​, శానిటైజర్లూ లేవంటున్నారు. ఆస్పత్రులు సరిపోక ఫుట్​బాల్​ స్టేడియాల్లో బెడ్లు వేసి ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. బెడ్లు సరిపోక ఆస్పత్రుల్లో కింద పడుకోబెట్టే చికిత్స చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు నౌరూజ్​ను వేడుకగా చేసుకునే పరిస్థితుల్లో జనం లేరు. బిజినెస్​లు దెబ్బతిని బతుకు బండి సాగక జీవితాలు కష్టాల్లో పడిపోయాయి.

ఈమె పేషెంట్‌ కాదు. నర్సు. పేరు.. నర్జిస్‌ ఖాన్‌ అలీ జాదే. ఇరాన్‌లోని లహిజాన్‌లో పనిచేసేది. పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ చేస్తూ ఒకరోజు ఉన్నట్టుండి పడిపోయింది. రెండ్రోజుల తర్వాత చనిపోయింది. టెస్టు చేస్తే కరోనా అని తేలింది. ఆమె మరణం ఇరాన్‌ సర్కార్‌పై విమర్శలకు కారణమైంది.