ఎలక్షన్ ​కోడ్​ను పకడ్బందీగా అమలు చేయాలి: సీఎస్​ శాంతికుమారి

ఎలక్షన్ ​కోడ్​ను పకడ్బందీగా అమలు చేయాలి: సీఎస్​ శాంతికుమారి

రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలక్షన్​ కోడ్​ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను సీఎస్​ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై సోమవారం సెక్రటేరియెట్​లో ఆమె అధికారులతో రివ్యూ చేశారు.

శాంతిభద్రతల పరిస్థితి, చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులలో సీజ్ చేసిన నగదు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటతో పాటు శంషాబాద్ విమానాశ్రయాల్లో కూడా తనిఖీలు చేయాలని అధికారులను  సీఎస్ ఆదేశించారు. 

రాష్ట్రంలో 85 సరిహద్దు చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు: డీజీపీ

ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో 85 సరిహద్దు చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. అన్ని పొరుగు రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సమావేశాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిఘాను పెంచాయన్నారు.