సీఎస్సీ ఈ–-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా(ఆధార్) సూపర్‌వైజర్/ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 31.
ఖాళీల వివరాలు
దేశవ్యాప్తంగా 282 సూపర్‌వైజర్/ ఆపరేటర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి/ ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి + రెండేండ్ల ఐటీఐ లేదా పదోతరగతి + మూడేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లై చేసే అభ్యర్థులు ఆధార్ సేవలను అందించడానికి యూఐడీఏ ద్వారా అధీకృత పరీక్ష, ధ్రువీకరణ సంస్థ జారీ చేసిన ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికెట్ ఉండాలి.
వీఎల్ఈలు సూపర్వైజర్ పోస్టులకు అప్లై చేయడానికి అర్హత లేదు.
వయోపరిమితి: 18 ఏండ్లు దాటి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 31.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు career.csccloud.in/job-post/OTAz వెబ్‌సైట్‌ను సందర్శించండి.
