
కోల్ కతాతో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై ఉతికారేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటర్లు కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. గ్రౌండ్ లో పరుగుల వరద పారించారు. వచ్చిన బాల్ ను వచ్చినట్లు బౌండరీ తరలించారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీ చేసుకున్నారు. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కోల్ కతాకు 236 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా 2, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
చెన్నై బ్యాట్స్ మెన్ స్కోరు ఇలా
- రుతురాజ్ గైక్వాడ్ 20 బంతుల్లో 35 పరుగులు
- డేవన్ కాన్వే 40 బంతుల్లో 56
- అజింక్యా రహానే 29 బంతుల్లో 71
- శివమ్ దూబె 21 బంతుల్లో 50
- జడేజా 8 బంతుల్లో 18
ఈ సీజన్ లో ఇప్పటికే బెంగళూరుపై 226 పరుగులు చేసిన చెన్నైకి.. ఐపీఎల్ లో (235) ఇది మూడో అత్యధిక స్కోరు. ఓవరాల్ గా ఎనిమిదవ అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2010 లో రాజస్థాన్ పై 246 పరుగులు, 2008లో పంజాబ్ పై 240 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో అత్యధిక స్కోర్లు చేసిన జట్లు (టాప్ 10 )
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263/5 ( 2013)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 248/3 (2016)
- చెన్నై సూపర్ కింగ్స్ 246/5 (2010)
- కోల్ కతా నైట్ రైడర్స్ 245/6 (2018)
- చెన్నై సూపర్ కింగ్స్ 240/5 ( 2008)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 235/1 ( 2015)
- ముంబై ఇండియన్స్ 235/9 (2021)
- చెన్నై సూపర్ కింగ్స్ 235/4 (2023)
- పంజాబ్ కింగ్స్ 232/2 (2011)
- కోల్ కతా నైట్ రైడర్స్ 232/2 (2019)