పకోడీ పంచాయితీ.. కస్టమర్పై షాపు యజమాని కత్తితో దాడి

పకోడీ పంచాయితీ.. కస్టమర్పై షాపు యజమాని కత్తితో దాడి

చిక్కెన్ పకోడీలో కారం ఎక్కువైయ్యిందని చెప్పినందుకు వినియోగదారుడిపై ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కె.పి.హెచ్.బి కాలనీలో నివసించే నాగార్జున మే 3వ తేదీ బుధవారం రాత్రి సమయంలో 9వ ఫేజులోని ఉన్న జే.ఎస్ చికెన్ పకోడీ సెంటర్ కు పకోడీ తినేందుకు వెళ్ళాడు. చికెన్ పకోడీ తింటూ అందులో కారం ఎక్కువైయ్యిందని షాపు నిర్వాహకుడు జీవన్ కు తెలిపాడు. తింటే తినండి లేకుంటే వెళ్ళిపొండి అంటూ నిర్వాహకుడు దూషించాడు. 

దాంతో వారి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో జీవన్, నాగార్జునపై కత్తితో దాడి చేశాడు. అయితే అదే సమయంలో నాగార్జున స్నేహితుడు ప్రణీత్ అడ్డుగా వెళ్ళడంతో అతని చేయిపై కత్తి వేటు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  బాధితుడు ప్రణీత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.