పొగతో మెస్సీ చిత్రాన్ని రూపొందించిన స్మోక్ ఆర్టిస్ట్

పొగతో మెస్సీ చిత్రాన్ని రూపొందించిన స్మోక్ ఆర్టిస్ట్

తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను సొంతం చేసుకున్న లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీ గురించి.. అర్జెంటీనాలోనే కాదు దేశ, విదేశాల్లోనూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో కటక్ కు చెందిన ఓ స్మోక్ ఆర్టిస్ట్ దీపక్ బిస్వాల్ మెస్సీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీపం వెలుగు నుంచి వచ్చే నల్లటి పొగతో అద్భుతాలు సృష్టించడం దీపక్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే స్మోక్ తో చాలా చిత్రాలు వేసి ఆకట్టుకున్నాడు. తాజాగా మెస్సీ చిత్ర పటాన్ని నిర్మించి, అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు.

ఫుట్ బాల్ కప్పుతో కూడిన మెస్సీ స్మోక్ చిత్రాన్ని మెస్సీకి, తన టీమ్ కు అంకితం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆర్టిస్ట్ దీపక్ చెప్పాడు. అయితే దీన్ని పూర్తి చేయడానికి తనకు మూడున్నర గంటల సమయం పట్టిందని తెలిపాడు. అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆనందకరమైన క్షణంలో తాను ఈ చిత్రాన్ని నిర్మించానని స్పష్టం చేశాడు. 

డేనియెల్‌‌‌‌‌‌‌‌ పాసరెల్లా, డీగో మారడోనా. లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీ. అర్జెంటీనా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్లు. పాసరెల్లా 1978లో, మారడోనా 1986లో దేశానికి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ అందించి తమ కెరీర్‌‌‌‌‌‌‌‌ను పరిపూర్ణం చేసుకున్నారు. ఇప్పుడు మెస్సీ కూడా  వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్పును ముద్దాడి వారి సరసన నిలిచాడు. టాలెంట్‌‌‌‌‌‌‌‌లో దివంగత మారడోనా స్థాయిని ఏనాడో అందుకున్న మెస్సీ మరెన్నో ఘనతలు సాధించాడు.  రెండు దశాబ్దాల కెరీర్‌‌‌‌‌‌‌‌ లో  37 క్లబ్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలు, ఏడు బాలన్‌‌‌‌‌‌‌‌ డిఓర్‌‌‌‌‌‌‌‌ అవార్డులు, ఆరు యూరోపియన్‌‌‌‌‌‌‌‌ గోల్డెన్‌‌‌‌‌‌‌‌ బూట్స్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నాడు.   కోపా అమెరికా కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు.  ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ కూడా మెడలో వేసుకున్నాడు. కానీ, అతని కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఏకైక లోటు ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. 16 ఏండ్ల నుంచి నాలుగు ఎడిషన్లలో ఎంత ప్రయత్నించినా నెరవేరని అతని కల ఖతార్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం రాత్రి సాకారం కావడంతో మెస్సీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మెస్మరైజ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.