- ఈ ఏడాది ఇప్పటికే 104 కోట్లు పోయినయ్
- ప్రతి బ్యాంకులో సైబర్సెల్స్ ఏర్పాటు చేయండి
- సైబరాబాద్ సీపీ రమేశ్
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలో 2025లో సైబర్ మోసాల కారణంగా బాధితులు రూ.438 కోట్లను కోల్పోగా, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.104 కోట్లను కోల్పోయారని సైబరాబాద్ సీపీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ బ్యాంకుల ప్రతినిధులతో శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఆడిటోరియంలో కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్ నేరాల ఫిర్యాదులపై వెంటనే స్పందించడానికి ప్రతి బ్యాంకులో సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి, క్రైమ్స్ డీసీపీ ఏ. ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్, సీఎస్‌బీ ఎస్పీ సాయి శ్రీ పాల్గొన్నారు.
