కలుషిత నీరు సరఫరా కావొద్దు

కలుషిత నీరు సరఫరా కావొద్దు
  • వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్

హైదరాబాద్, వెలుగు: తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రావొద్దని వాటర్​బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్డీకపూల్​లోని నిలోఫర్ హాస్పిటల్, బజార్ ఘాట్ ప్రాంతాలను ఆయన సందర్శించారు. దానకిశోర్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అధిక సంఖ్యలో శాంపిల్స్ సేకరించి పరీక్షించిన తర్వాతే సరఫరా చేయాలన్నారు. క్లోరిన్ సైతం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. 

ALSO READ :ఎమ్మెల్యే కోనప్ప అండతోనే భూ కబ్జాలు : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

అవసరమైన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా కాకుండా అన్ని చర్యలూ చేపట్టాలన్నారు. రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా చూడాలన్నారు. మ్యాన్ హోల్స్ ఉప్పొంగితే వెంటనే పూడిక తీయాలని వివరించారు. ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. 

వానల నేపథ్యంలో ఎమ‌‌‌‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ (ఈఆర్టీ) సిబ్బంది సైతం అన్ని ప‌‌‌‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌‌‌‌డానికి సిద్ధంగా ఉండాల‌‌‌‌న్నారు. వ‌‌‌‌ర‌‌‌‌ద నీరు వెళ్లేందుకు మ్యాన్​హోల్స్​పై ఉన్న మూత‌‌‌‌ల్ని సిటిజన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెర‌‌‌‌వొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.