భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజు

భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజు

కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీఫుల్స్ డెమెక్రటిక్ పార్టీ(PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలోనే అత్యంత చీకటి రోజు అని అన్నారు. ‘జమ్మూకశ్మీర్ నాయకత్వం 1947లో రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి భారత్ తో చేతులు కలిపింది. కానీ ఆ నిర్ణయం ఇవాళ కశ్మీరీల పాలిట శాపంగా మారింది.

ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధమే. దీనివల్ల భారత్ జమ్మూకశ్మీర్ లో దురాక్రమణదారుగా మారుతుంది. దీనివల్ల భారత ఉపఖండంలో పరిణామాలు తీవ్రంగా మారుతాయి. జమ్మూకశ్మీర్ ప్రజలను భయపెట్టి రాష్ట్ర భూభాగాన్ని లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కశ్మీర్ కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో భారత్ ఘోరంగా విఫలమైంది’ అని ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు మెహబూబా ముఫ్తీ.