సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు .. ఆకట్టుకున్న కూచిపూడి డ్యాన్స్ .. మహిషాసురమర్ధిని నాటకం

సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి సన్నిధిలో  నవరాత్రి ఉత్సవాలు .. ఆకట్టుకున్న కూచిపూడి డ్యాన్స్ .. మహిషాసురమర్ధిని నాటకం

 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు శ్రీదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, మహిషాసుర మర్ధిని నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు.