దసరా దర్శకుడికి బీఎండబ్ల్యూ.. సినిమా యూనిట్ కు బంగారు కాయిన్లు?

దసరా దర్శకుడికి బీఎండబ్ల్యూ.. సినిమా యూనిట్ కు బంగారు కాయిన్లు?

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసి  బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. ఈ సినిమా నాని కెరీర్లో మరో మైలు రాయిగా నిలుస్తుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే, ఇందులో నటించిన వారికే కాకుండా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ కు కూడా దసరా మరువలేని విజయాన్ని అందించింది. ఇందుకు కారణమైన దర్శకుడు ఓదెల శ్రీకాంత్ కు ఖరీదైన బీఎండబ్ల్యూని నిర్మాత  గిఫ్ట్ గా ఇచ్చాడట. అలాగే సినిమా యూనిట్ కు 25 గ్రాముల బంగారు కాయిన్లను ప్రజెంట్ చేశాడనే  ప్రచారం జరుగుతోంది.

 హీరో నానితో పాటుగా  నిర్మాత సుధాకర్ కు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సాధించిపెట్టింది. ఇదివరకు తన  ఎస్ఎల్వీ బ్యానర్లో వచ్చిన పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రవితేజతో తీసిన రామారావ్ ఆన్ డ్యూటీ వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను అందించలేకపోయాయి. దసరాతో తొలిసారి భారీ సక్సెస్ ను  రుచి చూశాడు నిర్మాత. దీంతో తన సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడట. ఈ సినిమా విజయం ఇచ్చిన జోష్ తో తన బ్యానర్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.