రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ 

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ 

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధమయ్యారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మరికాసేపట్లో రాజీనామా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కరువైందన్న ఆయన... రేవంత్ రెడ్డి ఆధిపత్య రాజకీయాల వల్లే పార్టీని వీడుతున్నారని శ్రవణ్ స్పష్టం చేశారు. రేవంత్ ఒంటెత్తు పోకడ, వన్ మ్యాన్ షో కారణంగా పార్టీ ఆగమవుతోందని విమర్శించారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అన్న శ్రవణ్.. ఆయన పీసీసీగా ఉన్నంత వరకు పార్టీ బాగుపడదని చెప్పారు. 

టీపీసీసీ రేవంత్ తీరుపై చాలా మంది నేతలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ  అందరూ మౌనంగానే ఉన్నారని శ్రవణ్ చెప్పారు. రేవంత్ తన వర్గం నేతల కోసం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు చాలా మంది నేతలు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీల వారు సైతం కాంగ్రెస్ లోకి వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు.