- దాసోజు శ్రవణ్ ఆరోపణ
- భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పాలన నియంత పోకడలతో నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీల్లో భూదొంగలు చెలరేగుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాదర్గుల్లో 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, కొందరు ఆ భూమి తమదంటూ ఫేక్ డాక్యుమెంట్లతో వస్తున్నారని మండిపడ్డారు. అన్ని భూములు పొంగులేటికి రాసిస్తున్నారా..? ఇదేం చిల్లర రాజకీయమని నిలదీశారు.
అందరూ వైట్‌కాలర్ క్రిమినల్స్ అని, భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని విమర్శించారు. కొత్వాల్ గూడ, మానస హిల్స్, వట్టి నాగులపల్లి, నాదర్ గుల్ లోని వేలాది ఎకరాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. పొంగులేటి రియల్ఎస్టేట్ ప్రెడేటర్‌గా మారిపోయారని పండిపడ్డారు.
