పెళ్లి పత్రికల్లో డేటాఫ్ బర్త్ తప్పనిసరి

పెళ్లి పత్రికల్లో డేటాఫ్ బర్త్ తప్పనిసరి

బాల్యవివాహాలు చట్టవిరుద్ధమంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు ఇవేమీ పట్టనట్లుగా కొందరు కొన్ని సెంటిమెంట్లను కారణంగా చూపుతూ బాల్య వివాహాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ మారు మూల గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈ సాంఘిక దురాచారానికి చెక్ పెట్టేందుకు రాజస్థాన్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లి పత్రికల్లో వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలని బుండీ జిల్లా అధికారులు ప్రజలకు చెబుతున్నారు. జిల్లాలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డేటాఫ్ బర్త్ తోపాటు బాల్యవివాహాలు నేరం అని కూడా ముద్రించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రింటింగ్‌ ప్రెస్సులకు కూడా ఆదేశాల జారీ చేస్తున్నారు.

అక్షయ తృతీయ రోజున (మే 7) రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతాయి. వీటిని అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు, భూరికార్టుల ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు చుట్టుక్కల జరిగే పెళ్లిళ్ళపై నిఘా పెట్టారు. పెళ్లి సందడి కనిపిస్తే వధూవరుల వయస్సులను ఆరా తీస్తున్నాయి.