యూజీసీ నెట్ ​జూన్ 18కి వాయిదా

యూజీసీ నెట్ ​జూన్ 18కి వాయిదా

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను రీషెడ్యూల్ చేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ప్రకారం జూన్​ 16న ‘నెట్’​ నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండడంతో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌‌బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నెట్ ​ను16 జూన్ (ఆదివారం) నుంచి 18 జూన్ (మంగళవారం)కు మార్చాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. యూజీసీ నెట్ అనేది దేశంలోని విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్​షిప్, అసిస్టెంట్​ఫ్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్​డీలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.